Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీకి మీసమొస్తే.. మాణికం లుక్‌లో తమన్నా!..

మిల్కీ బ్యూటీ మగాడిలా మారిపోయింది.. అంతేనా, తన పేరు కూడా మాణికం (తమిళ్) అని మార్చేసుకుంది. ఇందుకు సంబంధించిన తమన్నా లేటెస్ట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Tamannaah Bhatia Manickam Look Goes Viral1

Tamannaah : మిల్కీ బ్యూటీ మగాడిలా మారిపోయింది.. అంతేనా, తన పేరు కూడా మాణికం (తమిళ్) అని మార్చేసుకుంది. ఇందుకు సంబంధించిన తమన్నా లేటెస్ట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ తమన్నా మాణికంగా ఎందుకు మారిందయ్యా అంటే ఓ పాపులర్ బ్రాండ్‌కి సంబంధించిన ప్రకటన కోసం అన్నమాట. డీస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపి యాడ్ కోసం తమన్నా కొత్త లుక్‌లోకి మారి ఆకట్టుకుంటోంది. మగాడిలా మీసం పెట్టుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చెయ్యగా నెటిజన్లు ‘మగాడిలా మారిన మిల్కీ బ్యూటీ.. న్యూ గెటప్ అదుర్స్ అమ్మడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమన్నా ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ సినిమాలో విక్టరీ వెంకటేష్ పక్కన నటిస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి పాపులర్ హోమ్ అప్లయెన్సెస్ సంస్థ హావెల్స్‌ (Havells) కమర్షియల్‌లోనూ నటించింది.

Mahesh – Tamannaah : యాడ్ షూట్‌లో మహేష్, తమన్నా.. పిక్స్ వైరల్..