Yami Gautam : డైరెక్టర్‌ను పెళ్లాడిన హీరోయిన్ యామీ గౌతమ్..

బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. తన ప్రియుడు, దర్శకుడు ఆదిత్యను పెళ్లాడింది..

Yami Gautam

Yami Gautam: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. తన ప్రియుడు, దర్శకుడు ఆదిత్యను పెళ్లాడింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాం అంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసింది..

యామీ మ్యారేజ్ చేసుకున్న ఆదిత్య ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike)సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్‌తోనే
‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ The Immortal Ashwattham మూవీ చేస్తున్నారు.

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో మోడలింగ్ ఫీల్డ్‌లో పాపులర్ అయిన యామీ ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.. ‘విక్కీ డోనర్’ తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవిబాబు డైరెక్ట్ చేసిన ‘నువ్విలా’, అల్లు శిరీష్ ‘గౌరవం’, తరుణ్ ‘యుద్ధం’, నితిన్‌తో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తోంది.. యామీ గౌతమ్ పెళ్లి వార్త తెలియగానే పలువురు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు..