Aishwarya Rajesh : ‘పుష్ప’ రాజ్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేష్!.. క్లారిటీ ఇచ్చిన టీమ్..

తెలుగులో రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ తమిళనాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది..

Aishwarya Rajesh Not Playing Any Role In Pushpa Movie

Aishwarya Rajesh: తెలుగులో రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ తమిళనాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో ఐశ్వర్య నటిస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి..

అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, పుష్ప రాజ్ సిస్టర్ రోల్ చేస్తుందని న్యూస్ బయటకొచ్చింది.. రీసెంట్‌గా ఆ విషయం గురించి ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చారు.. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో ఐశ్వర్య నటించడం లేదని చెప్పేశారు..

కాగా ఐశ్వర్య రాజేష్ నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్‌కి రెడీగా ఉంది.. దేవ కట్టా, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందుతున్న ‘రిపబ్లిక్’ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లోనూ కనిపించనుంది ఐశ్వర్య రాజేష్..