Gangubai Kathiawadi: డేట్ ఫిక్స్ చేసుకున్న గంగూబాయి. ఎప్పుడంటే?

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పటికే పలు ప్రాజెక్టులను....

Alia Bhatt Gangubai Kathiawadi Locks Ott Release Date

Gangubai Kathiawadi: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పటికే పలు ప్రాజెక్టులను ఓకే చేయడంతో వీలైనంత త్వరగా వాటిని ముగించేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఆలియా భట్ లీడ్ రోల్‌లో నటించిన ఓ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Alia Ranbir : ఆలియా రణబీర్ పెళ్లి.. బయటకొచ్చిన మరిన్ని ఫోటోలు..

ఆలియా భట్ లీడ్ రోల్‌లో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ముంబైలోని ప్రముఖ రెడ్‌లైట్ ఏరియా కమాతీపురాలో పేరుమోసిన గంగూబాయి కతియావాడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఆలియా పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుండే కాకుండా సినీ క్రిటిక్స్ నుండి కూడా ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Gangubai Kathiawadi: గంగూభాయ్ పరిస్థితేంటి?.. బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా?

దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగా, ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.