సితార పాపకు మిడ్డీ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

  • Publish Date - December 8, 2020 / 08:23 PM IST

Alia Bhatt Gift To Sitara: సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఘట్టమనేని ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ కూడా నిర్వహిస్తూ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది.


సితారకు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లున్నారు. సితారకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసే నమ్రత తాజాగా సింపుల్ మిడ్డీ డ్రెస్ ధరించి క్యూట్ ఫోజు ఇచ్చిన సితార ఫొటోను షేర్ చేశారు.


ఈ డ్రెస్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. సితార పాపకు గిఫ్ట్‌ ఇచ్చిందట.. మంచి డ్రెస్ గిఫ్ట్ ఇచ్చారంటూ అలియాకు నమ్రత థ్యాంక్స్ తెలిపారు. సితార క్యూట్‌గా ఉన్నావ్ అంటూ మహేష్ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం అలియా హైదరాబాద్ విచ్చేసింది.