Allu Arjun: చాలా రోజుల నుండి ‘పుష్ప’ సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఆనందోత్సాహాల మధ్య అభిమానులకు ఒకే ఒక మాట చెప్పి వారిలో జోష్ నింపారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తాను నటిస్తున్న కొత్త సినిమా గురించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ గోలగోల చేశారు.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు.
కార్యక్రమం స్టార్ట్ అయ్యి, గెస్ట్‌లు మాట్లాడుతుండగానే బన్నీ ఫ్యాన్స్ ‘పుష్ప, పుష్ప’ అంటూ గోల గోల చేశారు. డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప’ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని మాట దాటవేశారు కానీ ఫ్యాన్స్ బన్నీని మాత్రం వదల్లేదు.. దీంతో ‘చావు కబురు చల్లగా’ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత తన కొత్త సినిమా గురించి చెప్పి స్పీచ్ ముగించారు బన్నీ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ‘‘వెళ్లేప్పుడు పుష్ప గురించి ఒక్కమాట చెప్పాలి. మీరు నా బలం.. ఆర్మీ.. ప్రాణం.. స్వతహాగా సంపాదించుకున్నానంటే అది కార్ కాదు, కోట్లు కాదు.. మీ అభిమానం మాత్రం. గర్వపడేంత వరకు తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. ‘చావు కబురు చల్లగా’ మీకు కూడా నచ్చుద్ది. ఈ సినిమాలో కొత్త విషయం ఉంది. పుష్ప గురించి ఒకే మాట.. ‘పుష్ప తగ్గేదే లే..’ అంటూ ముగించారు స్టైలిష్ స్టార్..