Bihar Floods : పడవలే క్లాస్‌రూమ్‌లు.. పాఠాలూ అందులోనే

పడవల్లో పాఠాలు వినేందుకు మొదట్లో ఎవరూ రాలేదన్నారు టీచర్లు. మునిగిపోయే ప్రమాదం ఉండదని... చదువుకునేందుకు అనువుగా ఉండే ప్లేస్ పడవలే అని నచ్చచెప్పామన్నారు.

Bihar Floods Classes

Bihar Floods : బిహార్ రాష్ట్రాన్ని ఇటీవలే వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలు.. బ్యాక్ టు బ్యాక్ వస్తుండటంతో.. వరద నీరు ఎటూ పోని పరిస్థితి. వరద కారణంగా.. రోడ్లు నదుల్లా మారాయి. చెరువులు పొంగడంతో… గ్రామాల్లోకి నీరు చేరింది. ఇళ్లు ఖాళీ చేసి శరణార్థి శిబిరాల్లోనూ జనం ఉంటున్న పరిస్థితి.  రోజులు గడుస్తున్నా… పడవల్లోనే జనం ప్రయాణించాల్సి వస్తోంది.

Illegal Affair : తనకంటే పదేళ్ల చిన్నవాడితో ప్రేమ..సహజీవనం… చివరికి…!

కతిహార్ జిల్లాలో ఎటు చూసినా నీళ్లే. కొన్ని పల్లెల్లో రోజులు గడిచినా వరద నీరు నిలిచే ఉంటోంది. బండ్లు మరిచిపోయిన జనం… పడవల్లోనే రాకపోకలు చేస్తున్నారు. స్కూళ్లు కూడా మునిగిపోయాయి. ఆవరణలో వరదనీరు కారణంగా… ఎవరూ స్కూళ్లోకి పోని పరిస్థితి. విద్యార్థులు, ఉపాధ్యాయులు పడవలపైనే వస్తూ పోతున్నారు.

మనిహర ఏరియాలో… సర్కారు టీచర్లు ఓ అడుగు ముందుకేశారు. పిల్లల భవిష్యత్తు పాడవ్వొద్దన్న ఉద్దేశంతో… సాహసానికి తెగించారు. స్కూళ్లలో వరద నిలిచిపోవడంతో.. పడవలనే క్లాస్ రూమ్స్ గా మార్చేశారు. పడవల్లోనే బోర్డులు ఏర్పాటుచేసి.. పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. నీళ్లలో అటు ఇటు ఊగే పడవలో.. రిస్క్ తీసుకుంటున్నప్పటికీ… పిల్లలు చదువుకు దూరం కాకుండా జాగ్రత్తపడుతున్నారు.

Harjit Singh : చేతికి రెండే వేళ్లు..అద్భుతమైన చిత్రాలు వేస్తు ఆన్ లైన్ వ్యాపారం

పడవల్లో పాఠాలు వినేందుకు మొదట్లో ఎవరూ రాలేదన్నారు టీచర్లు. మునిగిపోయే ప్రమాదం ఉండదని… చదువుకునేందుకు అనువుగా ఉండే ప్లేస్ పడవలే అని నచ్చచెప్పామన్నారు. తాము స్టూడెంట్లకు, వారి పిల్లలకు ధైర్యం చెప్పడంతో… ఇపుడు పడవల్లో పాఠాలు వినేందుకు పెద్దసంఖ్యలో వస్తున్నారని చెప్పారు కతిహార్ టీచర్లు. ఇంత కష్టపడుతున్న టీచర్లను శెభాష్ అనకుండా ఉండలేం.