Amit Shah links Congress black protest to ram mandir
Amit shah: దేశంలోని నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. రామందిరానికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ నిరసన చేపట్టిందని, 550 ఏళ్లకు రామమందిరానికి విముక్తి లభించి శంకుస్థాపన జరిగిన రోజునే (ఆగస్ట్ 4, 2021) ఇది జరగడం యాదృచ్ఛికమేమీ కాదని ఆయన అన్నారు. నిరసనలో నల్ల దుస్తులు వేసుకుని పాల్గొనడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఈరోజు నల్ల దుస్తుల్లో కనిపించారు. అయితే ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కాంగ్రెస్.. ఈడీ ఒక్క నోటీసు కూడా పంపని రోజు ఇంత పెద్ద ఎత్తున నిరసన చేపట్టడమేంటని అమిత్ షా ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ ప్రతిరోజు ఏదో ఒకరోజు నిరసన చేస్తూనే ఉంది. అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. బహుశా వారికేదైనా రహస్య అజెండా ఉండి ఉంటుంది. ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అయినప్పటికీ ఆకస్మికంగా ఈరోజు కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఈరోజే ఎందుకు నిరసనలు చేపట్టారనేది అర్థం కావట్లేదు. రామమందిరానికి శంకుస్థాపన ఇదే రోజు జరిగింది. ఇంతటి పవిత్రమైన రోజున కాంగ్రెస్ నల్ల దుస్తులతో నిరసన చేసింది. ఎవరి అజెండీ ఏంటో స్పష్టంగానే కనిపిస్తోంది’’ అని అమిత్ షా అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాముల్ గాంధీపై మండిపడ్డారు. పవిత్రమైన రోజున ఎవరైనా నల్లదుస్తులు ధరిస్తారా అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతల తీరు ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను అవమానపరచడమేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోజుల్లో దేశంలో హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరిగినట్లు కనిపిస్తోందా అంటూ యోగి ప్రశ్నించారు.
Israeli Strikes: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఎనిమిది మంది మృతి