Ananya Nagalla To Debut Tamil Film Industry
Ananya: టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చిన స్టార్ హీరోయిన్లు తమ ఫాలోయింగ్, క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు ఇతర భాషల్లో సినిమాలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం చాలా తక్కువ సినిమాలకే ఇతర భాషల్లో అవకాశాలను చేజిక్కించుకుంటారు. తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది అచ్చ తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ. ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య, తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Ananya Nagalla : పసుపు వర్ణంలో పలకరిస్తున్న అనన్య
అయితే తొలి సినిమాకంటే కూడా అనన్యకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం అని చెప్పాలి. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలితో పాటు అనన్య కూడా ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి ఆఫర్లు పట్టేస్తూ ప్రస్తుతం బిజీగా మారింది ఈ చిన్నది. అయితే టాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ, తమిళంలో డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
Ananya Nagalla : లంగాఓణిలో కొంటె చూపుతో చూస్తున్న తెలుగమ్మాయి అనన్య
తమిళ హీరో శశి కుమార్ నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్‌గా అనన్య సెలెక్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన చిత్ర యూనిట్, రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ‘అంజల్’ ఫేం దర్శకుడు తంగం పా.శరవణన్ తెరకెక్కిస్తుండగా ఇ.మోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గతంలోనూ పలువురు తెలుగు భామలు కోలీవుడ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి జాబితాలో అనన్య కూడా చేరిపోతుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.