Thank You Brother : ఏప్రిల్ 30న అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్!’.. రిలీజ్ పోస్టర్ లాంచ్ చేసిన నాగ చైతన్య..

స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ, అశ్విన్ విరాజ్ పాత్రల్లో నటిస్తుండగా.. ఉత్కంఠ‌భ‌రిత అంశాల‌తో ఒక డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’.. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమర్పణలో, జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి..

Anasuyas Thank You Brother Movie Releasing On April 30

Thank You Brother: స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ, అశ్విన్ విరాజ్ పాత్రల్లో నటిస్తుండగా.. ఉత్కంఠ‌భ‌రిత అంశాల‌తో ఒక డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’.. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమర్పణలో, జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాధ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ప్లే బాయ్ లాంటి అభి అనే ఓ యువ‌కుడు, ప్రెగ్నెంట్ అయిన ప్రియ అనే యువ‌తి ఓ లిఫ్ట్‌లో ఉండ‌గా ప‌వ‌ర్ పోయి, అందులో చిక్కుకుపోయిన‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయనేది ట్రైలర్‌లో చూపించి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ప్రెగ్నెంట్ వుమెన్‌గా అనసూయ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

లిఫ్ట్‌లో స్టక్ అయిపోయిన గర్భవతి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అలా అనసూయ తన నటనతో భావోద్వేగానికి గురి చేస్తూ కంటతడి పెట్టించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ యువసామ్రాట్ నాగచైతన్య అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30న ‘థ్యాంక్ యు బ్రదర్!’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..