Anupama Parameswaran : పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పకండి.. మీరు అలా అంటుంటే అదే నిజమేమో అనిపిస్తుంది..

అనుపమ సమాధానమిస్తూ.. ''మహిళలు అన్ని రకాలుగా సాధికారత సాధించారు. మళ్లీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పకండి. మీరు అలా చెప్పడం వల్లే..........

Anupama Parameswaran :  అ ఆ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే తాజాగా కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులని పలకరించి వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా అనుపమ ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, మహిళా సాధికారత మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు.

Vijay Devarakonda : నేనింకా చిన్న పిల్లాడ్ని.. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది..

దీనికి అనుపమ సమాధానమిస్తూ.. ”మహిళలు అన్ని రకాలుగా సాధికారత సాధించారు. మళ్లీ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పకండి. మీరు అలా చెప్పడం వల్లే నిజంగానే వెనుకబడి ఉన్నారనే భావన కలుగుతోంది. ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా ముందుకు వెళ్తున్నారు. ఇంట్లో పనులు చేసుకుంటూనే, బయట జాబ్స్ చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నారిప్పుడు. కానీ మగవాళ్లు అలా కాదు, పని చేసి ఇంటికి రాగానే బాగా అలిసిపోయాం టీ పెట్టి తీసుకురా అని అడుగుతారు చాలా మంది. నాకు తెలిసి సాధికారత అసలు మహిళలకే వచ్చింది, మగవాళ్లకే రాలేదనిపిస్తుంది ఒక్కోసారి” అని తెలిపింది. దీంతో అనుపమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు