Vijay Devarakonda : నేనింకా చిన్న పిల్లాడ్ని.. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''సగం దేశం తిరిగి వచ్చిన తరువాత ఇక్కడకు వచ్చాం. ఎక్కడకు వెళ్లినా కూడా ఇక్కడి వాళ్లు లైగర్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉండేది. ఈ రోజు ఇక్కడ...........

Vijay Devarakonda : నేనింకా చిన్న పిల్లాడ్ని.. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది..

Vijay devarakonda Speech

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి వరంగల్ లో ఫ్యాన్ డం పేరుతో ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి లైగర్ చిత్ర యూనిట్ అందరూ విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ”సగం దేశం తిరిగి వచ్చిన తరువాత ఇక్కడకు వచ్చాం. ఎక్కడకు వెళ్లినా కూడా ఇక్కడి వాళ్లు లైగర్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉండేది. ఈ రోజు ఇక్కడ పెద్ద ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. కానీ వర్షం వల్ల ఇలా చేస్తున్నాం. ఇండియా అంతా ఇప్పుడు ప్రేమ చూపిస్తోంది. కానీ ఇదంతా కూడా ఇక్కడే మొదలైంది. మీరు ఇచ్చిన ప్రేమను ఆగస్ట్ 25న ఫుల్లుగా తిరిగి ఇస్తాం. ఆగ్ లగా దేంగే అని ఇప్పుడు చెబుతున్నాం. సినిమా మీద ఏ డౌట్ లేదు, బ్లాబ్లా బ్లాక్ బస్టర్. ఇండియాను మీరు షేక్ చేయాలి. వరంగల్ మీరు షేక్ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రలో షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి. ఇందులో అమ్మ కొడుకులు తెలంగాణ కరీంనగర్ నుంచే ముంబైకి వెళ్తారు. కొడుకుని చాంపియన్ చేయాలని అమ్మ అనుకుంటుంది.”

Bandla Ganesh : కార్లు గాలిలోకి ఎగిరి.. హీరో వందమందిని కొడితే జనాలు థియేటర్లకు రారు.. టాలీవుడ్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

”నేను ఇంకా చిన్నపిల్లాడిని. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ పేరుకు తగినంతగా ఇంకా చేయలేదు, చేయాలి. మేం కూడా హైద్రాబాద్ నుంచి బాంబేకి వెళ్లాం. పూరి మా నాన్నలా, ఛార్మీ మా అమ్మలా మేం ముగ్గురం బయల్దేరాం. ఇండియాను షేక్ చేద్దామని బాంబేకి వెళ్లాం. ఏ ఇబ్బంది వచ్చినా ఎవ్వడు అడ్డు వచ్చినా వినేది లేదని ఫిక్స్ అయ్యాం. సినిమాలో ఓ డైలాగ్ ఉంది. పూరి రాసిన డైలాగ్ హీరోలు చెప్పాలంటే దేవుడి బ్లెస్సింగ్ ఉండాలి. నాకు ఆ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఇందులో ఓ డైలాగ్ ఉంది. దాంతో నేను ఎంతో కనెక్ట్ అయ్యాను. వుయ్ ఆర్ ఇండియన్స్.. ‘పోదాం.. కొట్లాడుదాం.. ఆగ్ హై అందర్.. దునియా ఆగ్ లగా దేంగే..వాట్ లగా దేంగే.’ లైగర్ టీంకు పని చేసిన అందరికీ చాలా థాంక్స్. ఐ లవ్యూ ఆల్” అని అన్నాడు.