Anushka Shetty – Naveen Polishetty: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతి రత్నాలు’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న విడుదలవుతోంది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది..
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే మూవీలో నవీన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పోలిశెట్టికి జాక్‌పాట్ లాంటి మరో ఆఫర్ లభించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నవీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి నటించనున్నాడని తెలుస్తోంది.. ‘బాహుబలి’ సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైలెన్స్’ ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించనున్నారు స్వీటీ.
40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం.. ‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో, సూపర్ హిట్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ అందించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది. మే నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది..