‘అరణ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్..
- sekhar
- Published On : February 28, 2021 / 08:22 PM IST
Aranya: భల్లాలదేవ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్’ పేర్లతో రూపొందుతుంది.
https://10tv.in/aranya-telugu-official-teaser-25932/
రానా ఈ సినిమాలో ‘బాణదేవ్’ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర కోసం చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు కూడా తగ్గాడు. సినిమా అంతా ఆయన గెడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తాడు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
అడవిని నమ్ముకుని, మూగా జీవాలతో సావాసం చేస్తూ బ్రతికే ఓ ఆదివాసి.. తనకి అన్నంపెట్టే అడవికి, ఏనుగులకి ఆపద వస్తే ఏం చేశాడు.. వాటి కోసం ప్రకృతితో సైతం ఎలా పోరాడాడు అనే పాయింట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది..
రీసెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.. ‘‘ప్రకృతికి మనిషికి జరుగుతున్న అతి క్రూరమైన పోరాటంలో, మన ఏనుగులను కాపాడటానికి సిద్ధం అవ్వండి’’.. రానా ట్వీట్ చేశాడు.
మార్చి 26న ‘అరణ్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 3వ తేదీన థియేట్రికల్ ట్రైలర్ ఈరోస్ నౌ ద్వారా విడుదల చెయ్యనున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీగా తెరకెక్కించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు మూవీ టీం..
ప్రకృతికి మనిషికి జరుగుతున్న అతి కౄరమైన పోరాటంలో, మన ఏనుగులను కాపాడటానికి సిద్ధం అవ్వండి.
Aranya trailer releasing March 3rd on @ErosNow. #Aranya #savetheelephants #manvsnature pic.twitter.com/fujDxoNmNw
— Rana Daggubati (@RanaDaggubati) February 28, 2021
