చైనా బలగాలను తిప్పికొట్టిన 5 జవాన్లకు అవార్డులు ప్రదానం చేసిన ఆర్మీ చీఫ్

  • Publish Date - June 26, 2020 / 12:01 PM IST

తూర్పు లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు, గాల్వాన్ వ్యాలీలో రెండు వేర్వేరు ఘర్షణల్లో చైనా బలగాలను తిప్పికొట్టడంలో గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శించిన 5 భారత ఆర్మీ సైనికులకు ‘ప్రశంస ప్రతాలను’బుధవారం(జూన్ 24, 2020)న ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ప్రదానం చేశారు. ఈ అవార్డలను తూర్పు లడఖ్ లోని ఫార్వర్డ్ లొకేషన్ లో సైనికులకు అందజేశారు.

గల్వాన్ వ్యాలీలో గత వారం చైనాతో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో 20 మంది భారత ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. 76 మంది గాయపడ్డారని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె తెలిపారు. ఆ సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన 5 సైనికులు ఆర్మీ చీఫ్ కామెండేషన్ అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు.

ప్రతి సైనికుడు చూపిన ధైర్య సాహసాలను గురించి ఆర్మీ చీఫ్ వారిని వ్యకిగతంగా అభినందించారు.  చైనా సైనికులను తరిమికొట్టడంలో గొప్ప ధైర్యాలను ప్రదర్శించారని వారిని ప్రశంసించారు.  భారత సైనికులు వారి విధి పట్ల ఉన్న నిబద్ధతకు వారికి అవార్డులు ఇవ్వబడ్డాయి అని ఆర్మీ చీఫ్ తెలిపారు.

తూర్పు లడఖ్‌లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె బుధవారం (జూన్ 24, 2020) సందర్శించారు. లడఖ్‌లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్‌ నరవణె పరిశీలించారు.

ఫార్వర్డ్‌ పోస్ట్‌ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్‌కు 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్, నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ యోగేశ్‌ కుమార్‌ జోషి అధికారులతో అక్కడ నెలకొన్న పరిస్ధితులపై సమీక్ష జరిపారు.

ట్రెండింగ్ వార్తలు