Buddhadeb Dasgupta : బెంగాలీ ఫిలిం మేకర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా కన్నుమూత.. మోదీ, మమతా సంతాపం..

ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు..

Bengali Filmmaker Poet Buddhadeb Dasgupta Passes Away

Buddhadeb Dasgupta: ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బుద్ధదేవ్‌ గురువారం ఉదయం మృతి చెందారు.

ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే, సత్యజిత్ రే వాస్తవిక చిత్రాల నుంచి ప్రేరణ పొందిన బుద్ధదేవ్‌కు ‘బాగ్‌ బహదూర్‌’, తహదర్‌ కథ’, ‘చరాచార్‌’, ‘ఉత్తర’ లాంటి సినిమాలు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.

అనేక జాతీయ – అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపాన్ని ప్రకటించారు. సినీ వర్గాల వారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు బుద్ధదేవ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.