టైటిల్ టెన్షన్: ‘భానుమతి రామకృష్ణ’ పేరు మార్చక తప్పదా?

  • Publish Date - July 2, 2020 / 02:46 PM IST

ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తదనంతో తెరకెక్కించిన ఈ రొమాన్స్ డ్రామా, తొలి తెలుగు OTT ఆహాలో జూలై 3న వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర టైటిల్‌పై నెలకొన్న వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘భానుమతి రామకృష్ణ’ అనే పేరుని మార్చాలంటూ.. లెజండరీ నటి, స్వర్గీయ భానుమతి రామకృష్ణ కొడుకు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవి కేవలం హీరో, హీరోయిన్ పాత్రల పేర్లే కానీ సినిమాకు ‘భానుమతి రామకృష్ణ’ అనే పేరుకి ఎలాంటి సంబంధం లేదని మేకర్స్ చెప్తున్నారు.

అయినప్పటికీ భానుమతి రామకృష్ణ కొడుకు వెనక్కు తగ్గలేదు. విడుదలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి టైటిల్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. చిత్ర యూనిట్ పేరు మారుస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకుడు.

Read:బాలయ్య బాబు కూడా నాలాగే.. ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ..