BJP workers clash: తిరంగా యాత్రలో బీజేపీ కార్యకర్తల మధ్య కుమ్ములాట

కాన్పూర్‭ నగరంలోని మోతిఝీల్ ప్రాంతంలో బుధవారం యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పర్యటన ఉంది. ‘తిరంగ యాత్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆయన రాక కోసం పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఇంతలో రెండు గ్రూపుల మధ్య కార్ల వివాదం తలెత్తింది. అంతే ఒకరినొకరు తిట్టుకుంటూ భౌతిక దాడులకు దిగారు.

BJP workers clash: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిమిత్తం దేశంలో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర ఘనంగా కొనసాగుతోంది. అధికార పార్టీ బీజేపీ దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‭లోని కాన్పూర్‭లో బీజేపీ చేపట్టిన ఈ తిరంగ యాత్రలో ఆ పార్టీకే చెందిన కార్యకర్తల మద్య కుమ్ములాటకు దారి తీసింది. కార్యకర్తలు ఒకరినొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ దాడులు చేసుకున్నారు. ఇదంతా ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యటనలో జరగడం విశేషం.

ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‭ నగరంలోని మోతిఝీల్ ప్రాంతంలో బుధవారం యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పర్యటన ఉంది. ‘తిరంగ యాత్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆయన రాక కోసం పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఇంతలో రెండు గ్రూపుల మధ్య కార్ల వివాదం తలెత్తింది. అంతే ఒకరినొకరు తిట్టుకుంటూ భౌతిక దాడులకు దిగారు. అయితే బీజేపీకి చెందిన ఒక సీనియర్ నేత వచ్చి వారి మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోను సమాజ్‭వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ షేర్ చేస్తూ.. ‘‘తిరంగా యాత్రను అల్లరి యాత్రగా మార్చొద్దని విజ్ణప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Rahul on Modi black magic comments: ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చొద్దు: మోదీకి రాహుల్ సూచన

ట్రెండింగ్ వార్తలు