Brazilian Man : మేనకోడలు కోసం Burpees చేసి గిన్నీస్ బుక్ రికార్డ్

తీవ్రమైన గుండె జబ్బులతో జన్మించిన మేనకోడలి చికిత్సకు అవసరమయ్యే డబ్బులు సేకరించడానికి వినూత్నంగా ప్రయత్నించాడు. burpees లో గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు.

Guinness world Record Burpees : వ్యాయామాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొంతమంది ఇంట్లోనే ఎక్సర్ సైజ్ చేస్తే..మరికొందరు జిమ్స్ లో వర్కవుట్ చేస్తుంటారు. తీవ్రమైన గుండె జబ్బులతో జన్మించిన మేనకోడలి చికిత్సకు అవసరమయ్యే డబ్బులు సేకరించడానికి వినూత్నంగా ప్రయత్నించాడు. burpees లో గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు. సింగపూర్ లో నివాసం ఉంటున్న Cassiano Rodrigues Laureano బ్రెజిలియన్ 60 నిమిషాల్లో 951 సార్లు burpees చేసి ఈ రికార్డు నెలకొల్పాడు.

Read More : Haryana : నీటిని చీల్చుకుంటూ..పైకి వచ్చిన భూమి, వింత ఘటన

తాను అలసిపోయినట్లు, తాను అనుకున్నంత ఇది ఈజీ కాలేదని వ్యాఖ్యానించారు. అయితే..సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దక్షిణ బ్రెజిల్ లోని సావో గాబ్రియేల్ మున్సిపాల్టీలో లారెనో జన్మించారు. ఇతను ప్రొఫెషనల్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. లారెనో మొదట వేయి burpees లను లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ రెండు రోజుల ముందు కాలికి గాయం కావడంతో అతని లక్ష్యం తగ్గింది. రికార్డు నెలకొల్పడానికి దాదాపు 9 నెలలు శిక్షణ పొందారు. ఓ గంటలో 879 burpees లు చేసిన Nick Anapolskyపై రికార్డు ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది.

Read More : Zomato Shares : రేపే జొమాటో షేర్ల లిస్టింగ్

ప్రతొక్కరికీ ఉదహారణగా నిలవాలని లారెనో భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలంటున్నారు. 2019, మే నెలలో సింగపూర్ వచ్చానని, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్లు వెల్లడించారు. వారికి సహాయం చేయగలిగేది ఇదొక్కటేనని తెలిపారు. కష్టతరమైన వ్యాయామాల్లో ఇదొకటని, అయితే..తనకు ఇది సులభమన్నారు.

ట్రెండింగ్ వార్తలు