Zomato Shares : రేపే జొమాటో షేర్ల లిస్టింగ్

జొమాటో లిమిటెడ్ షేర్లు శుక్రవారం(జులై-23,2021)స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి.

Zomato Shares : రేపే జొమాటో షేర్ల లిస్టింగ్

Zomoto2

Zomato Shares జొమాటో లిమిటెడ్ షేర్లు శుక్రవారం(జులై-23,2021)స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి. కాగా జొమాటో ఐపీఓ(ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్)రికార్డు స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయిన వారం రోజుల తర్వాత జొమాటో షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదట..లిస్టింగ్ డేట్ జులై 27గా నిర్ణయించబడినప్పటికీ ఇప్పుడు దానికి కంటే ముందుగానే శుక్రవారం ఉదయం మార్కెట్లోకి జొమాటో షేర్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి.

కాగా, రూ 9,400 కోట్ల రూపాయల సేకరణలో భాగంగా జులై-14న ప్రారంభమైన జొమాటో ఐపీఓ..జులై-16న ముగిసింది. ఐపీఓలో ఒక్కో షేర్ ధరను రూ. 72-76 రూపాయలుగా నిర్ణయించారు. ఐపీఓ కి ముందు 552.2 మిలియన్ షేర్లను రూ.76కి 186మంది యాంకర్ ఇన్వెస్టర్లకి కేటాయించడం ద్వారా జొమాటోకి రూ. 4,197 కోట్ల నిధులు సమకూరాయి. ఇక,జొమాటో ఐపీఓ షేర్ల అలాట్ మెంట్ ఈ రోజు జరిగింది. లాటరీ పద్ధతిలో షేర్లు ఇన్వెస్టర్లకు అలాట్ అయ్యాయి. ఒక లాట్ కొన్న ఇన్వెస్టర్లకు 195 షేర్లు క్రెడిట్ అవుతాయి.