Flipkart Amazon Sales : గెట్ రెడీ.. ఈ తేదీ నుంచే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్.. ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!
Flipkart Amazon Sales : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లుపై ఎలాంటి డిస్కౌంట్లు ఉండనున్నాయంటే?

Flipkart Amazon Sales
Flipkart Amazon Sales : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అతి త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ప్రారంభం (Flipkart Amazon Sales) కానున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వార్షిక పండుగ సేల్స్ త్వరలో ప్రారంభమవుతాయని అధికారికంగా వెల్లడించాయి. ఈ మెగా ఈవెంట్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల నుంచి హోం అప్లియన్సెస్, గాడ్జెట్‌ల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి.
ఈ రెండు ఇ-కామర్స్ దిగ్గజాలు ప్రమోషనల్ బ్యానర్‌లను కూడా రిలీజ్ చేశాయి. బ్యానర్ల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రాబోయే సేల్స్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
ప్రముఖ గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు :
ఈ ఏడాదిలో టెక్ ప్రియులకు అద్భుతమైన ట్రీట్ అందించనుంది. ఎందుకంటే కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మాక్స్, శాంసంగ్ గెలాక్సీ S24, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వంటి ఫోన్లపై భారీ తగ్గింపులు లభించే అవకాశం ఉంది.
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాదు.. సోనీ ప్లేస్టేషన్ 5, స్మార్ట్ కెమెరాలు, మ్యాక్‌బుక్ M2, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు మరిన్ని కూడా ఉంటాయి. వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13R, వన్ ప్లస్ 13S వంటి రాబోయే మోడళ్లు కూడా అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. సేల్ ప్రారంభ ఆఫర్‌లలో ఐక్యూ 13 సిరీస్, వివో V60 లైనప్ ఆకర్షణీయమైన డీల్స్ అందించనుంది.
బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు :
ఈ సేల్ సమయంలో ఇన్ స్టంట్ డిస్కౌంట్ల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ ప్రముఖ బ్యాంకులతో ఆఫర్లను అందిస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ :
ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు క్రెడిట్, డెబిట్ లేదా ఈఎంఐ లావాదేవీలతో చేసే కొనుగోళ్లపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ కోసం ఎక్స్ఛేంజ్ డీల్స్, కూపన్లు, షాపింగ్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ :
యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలుదారులకు ఫ్లిప్‌కార్ట్ 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ కూడా నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, అప్లియన్సెస్ వంటివి సరసమైన ధరలకే సొంతం చేసుకోవచ్చు.