SIM Cards : బాబోయ్.. సిమ్ మోసాలతో జాగ్రత్త.. మీ ఆధార్ పై ఎన్ని SIM కార్డులు ఉన్నాయో తెలుసా? ఇప్పుడే చెక్ చేసుకోండి!
SIM Cards : సిమ్ కార్డులతో జర జాగ్రత్తగా ఉండండి. మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయ్యాయో ఎప్పుడైనా చెక్ చేశారా?

SIM Cards
SIM Cards : దేశంలో సిమ్ కార్డుల మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాధితులకు తెలియకుండానే సిమ్ కనెక్షన్‌ల కోసం స్కామర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం (SIM Cards) చేస్తున్నారు. ఈ మోసాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సంచార్ సాథీ పోర్టల్‌లో TAFCOP (టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్) వ్యవస్థ కింద ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ టూల్ ద్వారా వినియోగదారులు తమ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయ్యాయో చెక్ చేసుకోవచ్చు. భారత్ లో మొబైల్ నంబర్లతో ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తి 9 యాక్టివ్ సిమ్‌లను కలిగి ఉండొచ్చు. అయితే జమ్మూ, కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో ఈ పరిమితి 6 మాత్రమే.
Read Also : Samsung Galaxy S24 FE : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర తగ్గిందోచ్.. అమెజాన్ లో జస్ట్ ఎంతంటే?
అయితే, సిమ్ ఫ్రాడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో టెలికం యూజర్లకు తెలియకుండానే వారి ఆధార్ వివరాలు అనధికార సిమ్‌లను లింక్ చేసే అవకాశం ఉంది. అందుకే మీ ఆధార్ కార్డుతో ఏమైనా సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయా? ఎన్ని సిమ్ కార్డులు మీ పేరుతో రిజిస్టర్ అయ్యాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.
SIM Cards : సిమ్‌లను ఎలా చెక్ చేయాలి? :
- సంచార్ సాథీ పోర్టల్ (sancharsaathi.gov.in)ని విజిట్ చేయండి.
- హోం పేజీలో (Citizen Centric Services)కి వెళ్లి ‘Know Your Mobile Connections’పై క్లిక్ చేయండి.
- క్యాప్చా కోడ్‌తో పాటు మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- వెరిఫికేషన్ కోసం మీ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత, పోర్టల్ మీ ఆధార్-లింక్డ్ ఐడెంటిటీ డాక్యుమెంట్లను ఉపయోగించి రిజిస్టర్ చేసిన అన్ని మొబైల్ నంబర్‌లను డిస్ ప్లే చేస్తుంది.
మీ ఆధార్‌లో రిజిస్టర్ అనుమానాస్పద ఫోన్ నంబర్లంటే? :
మీ పేరు మీద రిజిస్టర్ అయిన తెలియని సిమ్ మీకు కనిపిస్తే.. మీరు వెంటనే పోర్టల్ ద్వారా రిపోర్టు చేయొచ్చు. ఫ్లాగ్ చేసిన నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేసేందుకు “Not My Number” అని లేదా disconnect లేదా ఉపయోగించని సిమ్‌లకు “Not Required” అని గుర్తించవచ్చు.
రిపోర్టు చేసిన తర్వాత సంబంధిత టెలికాం ఆపరేటర్ అవసరమైన చర్యలు తీసుకుని ఆ నంబర్‌లను ఇన్ యాక్టివ్ చేస్తారు. అదనంగా, 9 కన్నా ఎక్కువ సిమ్‌లను ఆధార్‌తో లింక్ చేసిన వినియోగదారులు ఆటోమాటిక్ గా SMS నోటిఫికేషన్‌ను అందుకుంటారు. యాక్టివ్ కనెక్షన్ల సంఖ్యను రివ్యూ చేసి వెంటనే తొలగించాల్సిందిగా సూచిస్తుంది.