యాక్షన్ హీరో విశాల్ మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఎమ్.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో, విశాల్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘చక్ర’.. శ్రద్ధా శ్రీనాధ్, రెజీనా, సృష్టి డాంగే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..తాజాగా ‘చక్ర’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. సైబర్ హ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ప్రస్తుతం సొసైటీలో సగటు మనిషిని ముప్పుతిప్పలు పెడుతున్న హ్యాకింగ్ అనే అంశాన్ని కథాంశాంగా తీసుకుని, హీరోకి హ్యాకర్‌కి, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు హ్యాకర్‌కి మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మైండ్ గేమ్‌ని దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. విశాల్ యాక్టింగ్, బాలసుబ్రమణియణ్ విజువల్స్, యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. ‘కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే.. Welcome To Digital India’.. అంటూ ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. కె.ఆర్.విజయ, మనోబాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Video Link : https://youtu.be/N8B3chilPxI
Read: షూటింగులో వ్యక్తికి కరోనా.. ఉలిక్కిపడ్డ టీవీ పరిశ్రమ..