Chandra Mohan : నేను క్షేమంగానే ఉన్నాను.. పుకార్లు నమ్మకండి..

తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లకి కఠినంగా శిక్ష పడాలని సీనియర్ నటులు చంద్ర మోహన్ అన్నారు..

Chandra Mohan Gives Clarification On His Death Rumours

Chandra Mohan: తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లకి కఠినంగా శిక్ష పడాలని సీనియర్ నటులు చంద్ర మోహన్ అన్నారు. ఈ సందర్భంగా తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారాయన.

మొన్న మే 23న చంద్ర మోహన్ పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ వర్గాల వారు ఆయనకు విషెస్ చెప్పారు. ఇటీవల ఇక నటనకు శెలవు అని చెప్పిన చంద్ర మోహన్ మాటలను తీసుకుని.. ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇక లేరు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి..

‘నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి.. నా ఆరోగ్యం గురించి ఈ మధ్య ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయి.. నమ్మకండి.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను’’.. అని తెలిపారు చంద్ర మోహన్..