Chiranjeevi – Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది.
https://10tv.in/mega-fans-grand-welcome-to-chiranjeevi/
‘ఆచార్య’ లో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. చిరు, చరణ్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, విజువల్స్ బయటకొచ్చాయి.
చిరు, చరణ్‌లను చూసిన మెగాభిమానులు వెండితెరపై మెగా ట్రీట్ మామూలుగా ఉండదు మరి అంటూ ఈ పిక్స్, వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.