కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు..
- sekhar
- Updated on- February 20, 2021 / 12:04 PM IST
K. Viswanath: ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’, ‘సిరి సిరి మువ్వ’, ‘సిరివెన్నెల’, ‘శుభసంకల్పం’, ‘స్వయంకృషి’, ‘స్వర్ణకమలం’, ‘ఆపద్భాందవుడు’, ‘స్వాతికిరణం’ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకులు, ‘కళ’ కే ‘కళ’ తెచ్చిన కళాతపస్వికి కె.విశ్వనాథ్ జన్మదినోత్సవం నేడు (ఫిబ్రవరి 19)..
ఈ రోజుతో విశ్వనాథ్ గారు 91వ ఏట అడుగుపెట్టారు.. పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకాభిమానులు, సినీ ప్రేమికులు కళాతపస్వి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
గురుతుల్యులు,
పితృసమానులు,మహోన్నత దర్శకులు,తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంచేసిన
కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం,తెలుగు వారికి చిరస్మరణీయం.ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను pic.twitter.com/QarX4hCGp4— Chiranjeevi Konidela (@KChiruTweets) February 19, 2021
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కళాతపస్వికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘గురుతుల్యులు, పితృసమానులు,మహోన్నత దర్శకులు,తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంచేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం, తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ విశ్వనాథ్ గారితో తీసుకున్న ఫొటో షేర్ చేశారు చిరంజీవి.
