కింగ్ కోసం మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పలు సినిమా ఫంక్షన్లకు హాజరయ్యారు. నాగ్ హోస్ట్ చేసిన షోలకు చిరు, చిరు హోస్ట్ చేసిన షో కి నాగ్ గెస్ట్స్‌గానూ అటెండ్ అయ్యి అభిమానులను అలరించారు.
- sekhar
- Published On : March 11, 2021 / 08:26 PM IST
Chiranjeevi – Nagarjuna: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పలు సినిమా ఫంక్షన్లకు హాజరయ్యారు. నాగ్ హోస్ట్ చేసిన షోలకు చిరు, చిరు హోస్ట్ చేసిన షో కి నాగ్ గెస్ట్స్‌గానూ అటెండ్ అయ్యి అభిమానులను అలరించారు.
ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన స్నేహితుడికి సపోర్ట్ అందించబోతున్నారు. ‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. నాగ్ ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారి ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు. సయామీ ఖేర్, అలి రజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు..
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చిరంజీవి రిలీజ్ చెయ్యబోతున్నారు. మార్చి 12 సాయంత్రం 4:05 గంటలకు చిరు ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. ఏప్రిల్ 2న ‘వైల్డ్ డాగ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
My dear friend Megastar @KChiruTweets garu will launch the #WildDogTrailer
Tomorrow 4 05 pm!! ?#AcharyaForWildDog#WildDogOnApril2nd #WildDog@ahishor @MusicThaman @Deonidas @deespeak @SaiyamiKher @ActorAliReza @mayankparakh19 #PrakashSudarshan @onelifeitiz @MatineeEnt pic.twitter.com/3zz7VzOIlm— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 11, 2021
