చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ సెకండ్ లుక్..
- sekhar
- Published On : December 25, 2020 / 02:36 PM IST
Cobra 2nd look: ‘చియాన్’ విక్రమ్ ఎంత కష్టమైనా సరే.. సినిమా కోసం పోషించే పాత్ర కోసం హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తననితాను మలుచుకుంటారు. ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’.. ‘The King Cobra has Arrived’ అంటూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేశారు చియాన్.. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ‘కోబ్రా’ సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. ఫేస్ సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన విక్రమ్ లుక్ ఆకట్టుకుంటోంది.
విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. 2021 మే లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
