Pune Man Arrest
Facebook Post: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసినందుకుగాను 12వ తరగతి విద్యార్థిని అరెస్టు చేశారు పోలీసులు. యూపీలోని కన్నౌజ్ జిల్లా తాల్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్హియా గ్రామానికి చెందిన ఆశిష్ యాదవ్ (18) 12వ తరగతి చదువుతున్నాడు. తాజాగా, ఫేస్‌బుక్‌లో యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి అభ్యంతరక రీతిలో ఫొటోను పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు.
salt: అదనంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మరణ ముప్పు
దీనిపై డీజీపీకి కొందరు ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు ఆ విద్యార్థిని అరెస్టు చేశామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరు రాకేశ్ కుమార్ మిశ్రా, ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తాల్‌గ్రామ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆ విద్యార్థిని విచారించారని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.