salt: అద‌నంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణ ముప్పు

త‌గిన మోతాదులో ఉప్పు తీసుకునే వారితో పోల్చితే ఆహారంలో ప‌దే ప‌దే అద‌నంగా ఉప్పు వేసుకుని తినేవారు అకాల మ‌ర‌ణం చెందే ముప్పు 28 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని పరిశోధకులు గుర్తించారు.

salt: అద‌నంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణ ముప్పు

Salt

salt: ఉప్పు లేని కూరను తినాల‌నిపించ‌దు. అయితే, ఉప్పు వేసిన కూర‌, ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో మ‌రో చిటికెడు ఉప్పు వేసుకుని తింటారు కొంద‌రు. అలా వేస్తేనే రుచి బాగుంటుంద‌ని అంటుంటారు. అయితే, ఉప్పు తగినంత తీసుకునే వారితో పోల్చితే అధిక మోతాదులో ఉప్పు తీసుకునే వారికి అకాల మ‌ర‌ణం ముప్పు అధికంగా ఉంటుంద‌ని తాజాగా ప‌రిశోధ‌కులు గుర్తించారు. దాదాపు 5 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లకు సంబంధించిన వివ‌రాల‌ను అధ్య‌యనం చేసిన ప‌రిశోధ‌కులు దాని ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను యురోపియ‌న్ హార్ట్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

AIADMK: ఏఐఏడీఎంకే నుంచి ప‌న్నీర్ సెల్వం తొల‌గింపు.. చెన్నైలో 144 సెక్ష‌న్

త‌గిన మోతాదులో ఉప్పు తీసుకునే వారితో పోల్చితే ఆహారంలో ప‌దే ప‌దే అద‌నంగా ఉప్పు వేసుకుని తినేవారు అకాల మ‌ర‌ణం చెందే ముప్పు 28 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అందులో పేర్కొన్నారు. సాధార‌ణంగా 40 నుంచి 69 మ‌ధ్య వ‌య‌సు ఉన్న 100 మందిలో ముగ్గురు అకాల మ‌ర‌ణం చెందుతున్నార‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. ఆహారంలో అద‌నంగా ఉప్పు వేసుకుని తినే వారిని కూడా ఈ గ్రూపులో క‌లిపితే 100 మందిలో న‌లుగురు అకాల మ‌ర‌ణం పొందే ముప్పును ఎదుర్కొంటున్నట్లు చెప్ప‌వ‌చ్చ‌ని వివ‌రించారు. ఉప్పుకి, అకాల మ‌ర‌ణాల‌కు సంబంధించి చేసిన మొట్ట‌మొద‌టి ప‌రిశోధ‌న త‌మ‌దేన‌ని చెప్పారు.