ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. డబుల్ డిజిట్స్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 01వ తేదీ శుక్రవారం ఉదయానికి 60 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మొత్తం 1463కు చేరుకున్నాయి.
403 మంది డిశ్చార్జ్ కాగా..33 మంది మరణించారని వెల్లడించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1027గా తెలిపింది. కర్నూలు లో 400 మార్కును దాటింది. కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఒక్కో మరణం సంభవించింది.
జిల్లాల వారీగా : అనంతపురం 67. చిత్తూరు 80. ఈస్ట్ గోదావరి 42. గుంటూరు 306. కడప 79. కృష్ణా 246. కర్నూలు 411. నెల్లూరు 84. ప్రకాశం 60. శ్రీకాకుళం 5. విశాఖపట్టణం 25. విజయనగరం 0. వెస్ట్ గోదావరి 58.
కోవిడ్ పరీక్షలు : గడిచిన 24 గంటల్లో 7902 శాంపిల్స్ పరీక్షించగా..60 మందికి పాజిటివ్ ఉందని తేలింది.
Also Read | ఏపీలో తగ్గని కరోనా : కొత్తగా 71 కేసులు..జిల్లాల వారీగా వివరాలు