ఏపీలో తగ్గని కరోనా : కొత్తగా 71 కేసులు..జిల్లాల వారీగా వివరాలు

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 12:39 AM IST
ఏపీలో తగ్గని కరోనా : కొత్తగా 71 కేసులు..జిల్లాల వారీగా వివరాలు

ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1, 403కి చేరింది.

పరీక్షల సంఖ్యను క్రమక్రమంగా పెంచుతుండడంతో కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 20 ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కేసులు 722. పది రోజుల్లోనే ఈ సంఖ్య 1, 403కి చేరడంతో వైరస్ ఎంత స్పీడుగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఏప్రిల్ 20 నాటికి 30 వేల 773 మందికి పరీక్షలు నిర్వహిస్తే…ప్రస్తుతం వాటి సంఖ్య లక్షకు చేరుకుంది. గురువారం ఉదయం వరకు…మొత్తం 94 వేల 558 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కానీ..మరణాలు ఏమాత్రం సంభవించడం లేదని తెలిపింది. ఇప్పటి వరకు 31 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గురువారం నాటికి 34 మంది కోలుకున్నారు. (ప్చ్..మళ్లీ పెరిగాయి : తెలంగాణలో కరోనా.. కొత్తగా 22 కేసులు)

జిల్లాల వారీగా కేసులు : కర్నూలు 386. గుంటూరు 287. కృష్ణా 246. నెల్లూరు 84. చిత్తూరు 80. కడప 73. అనంతపురం 61. ప్రకాశం 60. పశ్చిమ గోదావరి 56. తూర్పుగోదావరి 42. విశాఖపట్టణం 23. శ్రీకాకుళం 5. 

కొత్త కేసులు : కర్నూలు 43. కృష్ణా 10. గుంటూరు 04. కడప 04. అనంతపురం 03. చిత్తూరు 03. తూర్పుగోదావరి 02. నెల్లూరు 02.