Yatra with 1000 kg Ambedkar coin: వెయ్యి కిలోల అంబేద్కర్ నాణెంతో ఢిల్లీకి యాత్ర.. అడ్డుకున్న హర్యానా పోలీసులు

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్‭లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప్రవేశించబోతుండగా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్రలో భాగమైన నవసర్జన్ ట్రస్ట్ సభ్యుడు మార్టిన్ మాక్వాన్ మాట్లాడుతూ ‘‘రాజస్తాన్‭లో మా యాత్రను విజయవంతంగా

Yatra with 1000 kg Ambedkar coin: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్నా దేశంలో ఇంకా కొనసాగుతోన్న అంటరానితనాన్ని వ్యతిరేకించడంతో పాటు అంటరానితనంపై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ డాక్టర్ అంబేద్కర్ చేసిన మొదటి రాజకీయ ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ వెయ్యి కిలోల ఇత్తడితో చేసిన అంబేద్కర్ నాణెంతో గుజరాత్‭లోని అహ్మదాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి యాత్రగా బయల్దేరారు కొన్ని దళిత సంఘాల కార్యకర్తలు. అయితే వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ యాత్రను రాజస్తాన్ దాటి హర్యానాలోకి ప్రవేశించే ముందు అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్రకు అనుమతి లేదని హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేఖను యాత్రలో ఉన్న వారికి చూపించారు.

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్‭లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప్రవేశించబోతుండగా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఈ యాత్రలో భాగమైన నవసర్జన్ ట్రస్ట్ సభ్యుడు మార్టిన్ మాక్వాన్ మాట్లాడుతూ ‘‘రాజస్తాన్‭లో మా యాత్రను విజయవంతంగా ముగించుకుని హర్యానా సరిహద్దులోకి వెళ్లాం. అప్పటికే పోలీసులు సరిహద్దులో పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. మమ్మల్ని హర్యానాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదని హోంమంత్రిత్వ శాఖ పంపిన లేఖను చూపించారు. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ జాం కూడా ఏర్పడింది’’ అని తెలిపారు.

Ambedkar Statue with iron scrap : మూడు టన్నుల ఐరన్ స్క్రాప్‌తో అంబేద్కర్ విగ్రహం..

‘‘మాకు వారు(హర్యానా పోలీసులు) ఒక గెస్ట్ హౌజ్ ఇచ్చారు. ఆహారం కూడా ఇచ్చారు. కానీ మేం వాటిని సున్నితంగా తిరస్కరించాం. మేం రాత్రంతా రోడ్డు మీదే ఉన్నాం. అనంతరం సోమవారం రాత్రి గుజరాత్‭కు తిరుగు ప్రయాణమయ్యాం. రాజస్తాన్‭లో యాత్ర పోలీసుల రక్షణతో సాగింది. విచిత్రంగా హర్యానాలో మాకు అనుమతే లేదని చెప్పారు. ఢిల్లీ నుంచి కూడా మాకు అనుమతి లేదట. భద్రతా సమస్యల వల్ల మాకు అనుమతి ఇవ్వలేదని వారు చెప్పారు. ఈ దేశ ప్రజలకే భద్రత కల్పించలేకపోవడం ఏంటి?’’ అని హర్యానాకు చెందిన రవి కుమార్ తెలిపారు.

యాత్రగా తీసుకు వస్తున్న ఆ నాణేన్ని నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి ఇచ్చేందుకు వెళ్తున్నారట. నాణేనికి ఒకవైపు బాబాసాహేబ్ అంబేద్కర్ ఉండగా మరొకవైపు బోధిసత్వ గౌతమ బుద్ధుడు ఉన్నాడట. ప్రజల నుంచి సేకరించిన ఇత్తడితో దీన్ని తయారు చేసినట్లు యాత్రికులు తెలిపారు. ఒడిశా, ఢిల్లీకి చెందిన నిపుణులు దీన్ని రూపొందించారట. ఆ నాణెంపై ‘‘1947లో అంటరానితనం లేని దేశంగా చూడాలన్న కల 2047కి అయినా నెరవేరుతుందా?’’ అని హిందీ, ఇంగ్లీషులో రాసి ఉంది. అలాగే అంటరానితనం అనే పదాన్ని దేశంలోని 15 భాషల్లో రాశారు.

Yogi on Caste and Religion: కుల, మతాలుగా విడిపోతే దేశం బలహీనం అవుతుంది: యోగి

ట్రెండింగ్ వార్తలు