Ambedkar Statue with iron scrap : మూడు టన్నుల ఐరన్ స్క్రాప్‌తో అంబేద్కర్ విగ్రహం..

మూడు టన్నుల ఐరన్ స్క్రాప్‌తో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు సూర్య శిల్పశాల శిల్పులు.

Ambedkar Statue with iron scrap : మూడు టన్నుల ఐరన్ స్క్రాప్‌తో అంబేద్కర్ విగ్రహం..

Br Ambedkar Statue With Iron Scrap

BR Ambedkar Statue with iron scrap : ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో వ్యర్ధాలతో విగ్రహాలు తయారు చేయటంతో సూర్య శిల్పశాల శిల్పులు ప్రసిద్ధి చెందారు. ఈ క్రమంలో ‘మహాపరినిర్వాన్ దివస్’ గా నిర్వహణలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా మూడు టన్నుల ఇనుప వ్యర్ధాలతో అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేశారు సూర్య శిల్పకళా కళాకారులు. సూర్య శిల్పశాల.. భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దింది.వేలాది విగ్రహాలను తయారు చేసిన ప్రముఖ సూర్య శిల్పశాల శిల్పులు మూడు టన్నుల ఐరన్ స్క్రాప్‌ (ఇనుమ వ్యర్ధాలు) తో 14 అడుగుల ఎత్తున్న అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని తయారు చేశారు. మూడు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసామని సూర్యశిల్పకళా శిల్పి రవి చంద్ర తెలిపారు. అంబేద్కర్ 66వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ ఆవిష్కరించారు.

Read more : Olx లో అమ్మకానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం, ధర రూ.30వేల కోట్లు

కాగా గతంలో కూడా సూర్య శిల్పశాల శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర నిర్మించిన విగ్రహాలు పలు ప్రశంసలు పొందాయి. మోడరన్ ఆర్ట్స్ లో ఐరన్ స్క్రాప్ తో అద్భుతమైన కళా ఖండాలను తయారు చేయటంలో వీరు సిద్ధహస్తులు. భారీ సైజులో వీణ, తబల, మహాత్మ గాంధీ విగ్రహాలను నిర్మించారు. అలాగే ఐరన్ బోల్ట్ లు, నట్టులతో మోడీ విగ్రహాన్ని కూడా తయారు చేసి ఔరా ఏమి వీరి పనితనం అనిపించారు. విజయవాడలో ప్రసిద్ధి చెందిన ఆటోనగర్ లో స్క్రాప్ కొని ఇలా కళాకృతులను తయారు చేస్తున్నారు సూర్య శిల్పకళా నిపుణులు.

Read more : 35kg Mask : ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. ఎందుకు? ఎక్కడ తయారుచేశారు.. ?

కాగా..‘బాబాసాహెబ్’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ అంబేద్కర్  డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు. ఆయన వర్దంతిని ఏటా ‘మహాపరినిర్వాన్ దివస్’గా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, జాతీయోద్యంలో దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, తత్వ శాస్త్రవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, ఇలా అంబేద్కర్  గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భరతమాత ముద్దు బిడ్డ అంబేద్కర్ జయంతి జరుపుకోవటం భారతీయుల బాధ్యత. ఆయనకు నివాళులు అర్పించటం మనందరి కర్తవ్యం.

Read more : Toothbrush Sculpture : 80,000 టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌.. గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌