35kg Mask : ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. ఎందుకు? ఎక్కడ తయారుచేశారు.. ?

జపాన్‌లో 57 మీటర్లు ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్కు ను ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ‘35 కిలోలు’ బరువు ఉన్న మాస్కులను బౌద్ధ మాతకు ధరింపజేశారు. అనంతరం కరోనా మహమ్మారి నుంచి మా బిడ్డలను కాపాడు తల్లీ అంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు జపాన్ లోని కుషిమా ప్రిఫెక్చర్‌ ప్రాంతం వాసులు.

35kg Mask : ప్రపంచంలోనే అతి పెద్ద మాస్క్.. ఎందుకు? ఎక్కడ తయారుచేశారు.. ?

Japan Giant Buddhist Goddess Statue 35 Kg Weight Face Mask To Pray For End Of Covid 19

Face mask for statue: కరోనా దెబ్బకు ప్రపంచమంతా కలావికలం అపోయింది. ఇంకా వైరస్ ప్రభావం చూపుతూనే ఉంది. ఈక్రమంలో భారత్ లో పలు ప్రాంతాల్లో కరోనామాతకు గుడులు కట్టి పూజలు చేస్తున్న ఘటనల గురించి వింటున్నాం. వాటికి మాస్కులు పెట్టటం గురించి కూడా వింటున్నాం. ఈక్రమంలో జపాన్‌లో మాత్రం ఏకంగా 57 మీటర్లు (187 అడుగుల) ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్కు ను ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి మాస్క్ పెట్టాలంటే ఆ మాస్క్ కూడా భారీగా ఉండాలి కదా మరి. ఆ మాస్క్ 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ఈ మాస్కు ..‘35 కిలోలు’ బరువు ఉంది..!!.

కరోనా పేరు చెబితే ఎంతగా హడలిపోతున్నామో..జపాన్ లోని కుషిమా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో ఉన్న బౌద్ధ అమ్మవారి విగ్రహం అంత అందంగా ఉంది. ధవళవర్ణలో కరోనా అమ్మవారి విగ్రహం మెరిసిపోతూ కనిపిస్తుంది. చంటిబిడ్డను ఎత్తుకున్నట్లుగా ఉన్న బౌద్ధమాత ముఖంలో మాతృత్వం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. కుషిమా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో బౌద్ధ దేవాలయం వద్ద ఉన్న బౌద్ధ మాత విగ్రహానికి మాస్కు తొడిగి..‘కరోనా పీడ వదిలిపోవాలని కోరుతూ ఆ దేవతను ప్రార్ధించారు జపాన్ వాసులు. బౌద్ధ మాత చేతుల్లో ఓ బిడ్డ కూడా ఉంటుంది. కరోనా నుంచి శిశువులను రక్షించు మాతా?’ అంటూ ప్రార్ధనలు చేశారు.

57 మీటర్ల ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహాన్ని దేవత విగ్రహాన్ని 33 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ విగ్రహం 57 మీటర్ల ఎత్తు ఉండటంతో వారు 35 కేజల మాస్కు కూడా భారీగానే తయారు చేశారు. అలా తయారు చేసిన మాస్కు 35 కిలోల బరువు ఉంది. నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు కష్టపడి తాళ్ల సహాయంతో కరోనా మాత విగ్రహం పైకి ఎక్కి మాస్కును ధరింపజేశారు. అలా విగ్రహం 57 అడుగులు కాగా..ఫేస్ వద్దకు అంటే 55 మీటర్ల ఎత్తుకు మాస్కును తీసుకెళ్లి తొడిగారు. ఈ 57 మీటర్ల ఎత్తున్న కరోనా మాత విగ్రహం దానికి పెట్టిన ఫేస్ మాస్కుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా తమ బిడ్డలను కాపాడమని జపాన్ వాసులు ఈ బౌద్ధ మాత వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. జపాన్ అంటేనే భూకంపాలకు నిలయంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో గత ఫిబ్రవరిలో సంభవించిన భూకంపానికి బౌద్ధ మాత విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. దీంతో విగ్రాహానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఈ భారీ మాస్కును తయారుచేసి బౌద్ధ మాతకు ధరింపజేసి..కరోనా నుంచి మా బిడ్డలను కాపాడు తల్లీ అంటూ ప్రార్థనలు చేశారు.