Olx లో అమ్మకానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం, ధర రూ.30వేల కోట్లు

ఏంటి టైటిల్ చూసి షాక్ తిన్నారా? భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(statue of unity) విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో(olx) అమ్మకానికి పెట్టడం

  • Published By: veegamteam ,Published On : April 4, 2020 / 09:22 AM IST
Olx లో అమ్మకానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం, ధర రూ.30వేల కోట్లు

ఏంటి టైటిల్ చూసి షాక్ తిన్నారా? భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(statue of unity) విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో(olx) అమ్మకానికి పెట్టడం

ఏంటి టైటిల్ చూసి షాక్ తిన్నారా? భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(statue of unity) విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో(olx) అమ్మకానికి పెట్టడం ఏంటి? ధర రూ.30వేల కోట్లుగా నిర్ధారించడం ఏంటి? అనే అనుమానాలు కలగొచ్చు. మ్యాటర్ ఏంటంటే.. గుర్తు తెలియని వ్యక్తి ఓఎల్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది అని చెబుతూ ఓ మేసేజ్ కూడా పెట్టాడు. ”ఎమర్జెన్సీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని అమ్ముతున్నాం. అర్జంట్ మనీ అవసరం. ఆసుపత్రులు, హెల్త్ కేర్ ఎక్విప్ మెంట్ కొనుక్కోవడానికి డబ్బు చాలా అవసరం” అని మేసేజ్ కూడా ఉంది.

రెడిట్ లో ఈ పోస్టు ఉంది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసి అంతా విస్తుపోతున్నారు. కాగా ఇది జోక్ అని కొందరు తేల్చారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని అమ్మే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. ఇకపోతే ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. కాగా ఓఎల్ ఎక్స్ లో దీని ఖరీదుని రూ.30వేల కోట్లుగా నిర్ధారించారు. 

కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ.. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం పీఎమ్ కేర్స్‌ ఫండ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలను ప్రధాని మోడీ కోరారు. దీంతో పీఎం కేర్స్ కు విరాళాలు వెల్లువెత్తాయి. ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్తలు, సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ విరాళాలు సరిపోవని ఆ వ్యక్తి అనుకున్నాడో ఏమో కానీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టేశాడు.

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తారు. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 3వేల కోట్లు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ఐక్యతకు చిహ్నం. వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశపు తొలి హోంమంత్రి. ఈ విగ్రహం భారతదేశ సమైక్యతకు చిహ్నం అని ప్రధాని మోడీ చెప్పారు. మొత్తం విగ్రహం ఎత్తు 182 మీటర్లయినా, అందులో పీఠం ఎత్తే 25 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో(93 మీటర్లు) పోలిస్తే ఈ విగ్రహం రెండింతలు ఎత్తైనది. 2012-13లో ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్ట్ 2018 లో పూర్తయింది.

1

 

2

Also Read | ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు