Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
Delhi Air Quality : మీరు ఢిల్లీ NCRలో నివసిస్తున్నారా? దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్రస్థాయిలోకి పడిపోయింది. వైద్య ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఢిల్లీ గాలి పీల్చడం రోజుకు 33 సిగరెట్లు తాగినట్లేనని అంటున్నారు. అలాంటి ప్రమాదకర పరిస్థితిలో మీరు మీ గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను తప్పక ఉంచుకోవాల్సిందే.. మీరు వెంటనే ఈ పని చేయడం ద్వారా వాయు కాలుష్యం నుంచి బయటపడవచ్చు.
Xiaomi, Phillips మరెన్నో బ్రాండ్‌ల నుంచి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు సరసమైన ధర ట్యాగ్‌లో కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఎయిర్ ప్యూరిఫైయర్‌ని కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడంలో మీకు సాయపడే 5 బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయవచ్చు.
Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
– ముందుగా ఫిల్టర్‌ని చెక్ చేయండి.
– HEPA ఫిల్టర్‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవచ్చు.
– నాలుగు-లేయర్ల ఫిల్టర్‌తో వస్తుంది. మీ ఇంట్లో గాలిని క్లీన్ చేస్తుంది.
– ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేసే ముందు రూమ్ సైజును చెక్ చేయండి.
– రియల్-టైమ్ గాలి నాణ్యతను చూపించే ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఎంచుకోండి.
– వినియోగదారులకు పరిసరాలలోని గాలి నాణ్యత గురించి తెలుసుకోండి.
– నిర్వహణ ఖర్చును చెక్ చేసుకోండి. ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేసే ముందు.. మెషిన్ నిర్వహణ ఖర్చు గురించి యూజర్లకు స్పష్టమైన ఆలోచన ఉండాలి.
– సులభమైన ఫిల్టర్ చేసుకోవచ్చు. వినియోగదారులు సులభమైన ఫిల్టర్ రీప్లేస్‌మెంట్ ప్రాసెస్‌తో వచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఎంచుకోవాలి.
– విద్యుత్ వినియోగం కోసం చెక్ చేయండి. ఏ ఇతర అప్లియన్సెస్ మాదిరిగానే, ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంత శక్తిని వినియోగిస్తుందో చెక్ చేయండి.
– వారంటీ, సేల్స్ తర్వాత సేల్ అనేవి ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు రెండు ముఖ్యమైన అంశాలను పరిగణించాలి.
ఇప్పుడు, ఇంట్లోనే అధిక AQIని తొలగించడానికి మీరు ఎంచుకోగల కొన్ని సరసమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌లను చూడవచ్చు.
Mi Air Purifier 3 : OLED టచ్ డిస్‌ప్లే, రియల్ HEPA ఫిల్టర్, 360° ట్రిపుల్ లేయర్ ఫిల్ట్రేషన్, వాయిస్ అసిస్టెంట్‌తో పని చేస్తుంది. స్మార్ట్ APP కంట్రోల్‌కి సపోర్టు ఇస్తుంది. మరిన్నింటితో వస్తుంది. దీని ధర 9,999గా ఉండవచ్చు.
Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
Realme TechLife Air Purifier : ఎయిర్ ప్యూరిఫైయర్ మూడు-దశల ఫిల్ట్రేషన్ సిస్టమ్, టచ్ కంట్రోల్, 5 ప్యూరిఫైయింగ్ మోడ్‌లు, రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్, స్మార్ట్ ఫిల్టర్ చేంజ్ ఇండికేటర్ మరిన్నింటితో వస్తుంది. ప్యూరిఫైయర్ ధర రూ. 7999గా ఉంది.
Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
Philips 1000i Series Air Purifier : ఈ డివైజ్ ఎయిర్ క్వాలిటీ డిస్‌ప్లే, స్మార్ట్ సెన్సార్‌లు, HEPA ఫిల్టర్, స్మార్ట్ ఫిల్టర్ ఇండికేటర్, స్మార్ట్ లైట్ కంట్రోల్‌తో వస్తుంది. గాలి నుంచి 99.9 శాతం వైరస్‌లు, ఏరోసోల్‌లను తొలగిస్తుందని పేర్కొంది. ఈ మిషన్ ధర రూ.9,999గా ఉంది.
Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
Voltas Air Purifier VAP36TWV : ఈ మిషన్ 6 దశల ఫీల్టర్ ప్రక్రియతో వస్తుంది. గాలి నాణ్యత సూచిక, PM 2.5 ఎయిర్ సెల్స్ తొలగించగలదని పేర్కొంది. ప్యూరిఫైయర్ ఇంటెలిజెంట్ సెన్సార్, నెగటివ్ అయాన్ జనరేటర్, మరిన్నింటితో రూ. 9,490 ధరతో వస్తుంది.
Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
Acerpure Pro Air Purifier : ఈ డివైజ్ 4 ఇన్ 1 HEPA ఫిల్టర్‌తో 4-లేయర్ ప్రొటెక్షన్, స్మార్ట్ సెన్సార్, కాలుష్య కారకాలు, జెర్మ్స్, బ్యాక్టీరియాతో మరిన్నింటిని తొలగించే నెగటివ్ అయాన్ జనరేటర్‌తో వస్తుంది. దీని ధర రూ.9,990గా ఉంది.
Delhi NCR air pollution gets severe Best air purifiers you can get under Rs 10,000
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Gmail Full : మీ జీమెయిల్ ఫుల్ అయిందా? మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా బల్క్ ఈ-మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలో తెలుసా?