Dilraju in Tirumala : కొడుకుతో తొలిసారి తిరుమలలో దిల్ రాజు, భార్య తేజస్విని

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వరుస సమావేశాలతో బిజీగా ఉన్న దిల్ రాజు నేడు శుక్రవారం ఉదయం భార్య తేజస్విని, కొడుకుతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

  • Updated on- August 5, 2022 / 05:39 PM IST

dilraju in tirumala

 

Dilraju in Tirumala :  డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారి విజయం సాధించి ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆ తర్వాత దిల్ రాజు కూతురి ఒత్తిడితో కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు.

ఇటీవలే 2022 జూన్ 29న దిల్ రాజు భార్య తేజస్విని పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. దీంతో దిల్ రాజు చాలా ఆనందంలో ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వరుస సమావేశాలతో బిజీగా ఉన్న దిల్ రాజు నేడు శుక్రవారం ఉదయం భార్య తేజస్విని, కొడుకుతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Purnaa : పెళ్ళికూతురిలా ముస్తాబైన పూర్ణ

దర్శనానంతరం ఆలయం నుంచి బయటకు వస్తూ మీడియాకి చిక్కారు. టాలీవుడ్ సమస్యలపై మీడియా ప్రశ్నించగా దేవుడి సన్నిధిలో అవేమి మాట్లాడాను అని వెళ్లిపోయారు. తొలిసారి కొడుకుతో కలిసి తిరుమల వెళ్లిన దిల్ రాజు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.