Koratala Siva : సోషల్ మీడియాకు సెలవు..

సడెన్‌గా సోషల్ మీడియా నుండి వెళ్లిపోతున్నట్టు అనౌన్స్ చేసి, మూవీ లవర్స్‌కి షాకిచ్చారు కొరటాల శివ..

Director Koratala Siva Decides To Move Away From Social Media

Koratala Siva: రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ‘మిర్చి’ తో డైరెక్టర్‌గా టర్న్ అయ్యి.. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వరుస బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీశారు కొరటాల శివ. ఆయనతో పని చేసిన హీరోలందరికీ వాళ్ల కెరీర్‌లో బెస్ట్ మూవీస్ ఇచ్చారు.

Koratala Siva : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..

కథకి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్, ఎమోషన్ వంటివి యాడ్ చేసి మెప్పిస్తూ తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆచార్య’ చేస్తున్నారు. సడెన్‌గా సోషల్ మీడియా నుండి వెళ్లిపోతున్నట్టు అనౌన్స్ చేసి, మూవీ లవర్స్‌కి షాకిచ్చారు.

ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు కొరటాల. ‘ఇప్పటివరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా ఎన్నో మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నాను, ఇప్పుడు సామాజిక మాధ్యమం నుండి వైదొలగుతున్నాను. మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను’.. అని నోట్‌లో పేర్కొన్నారు. ‘ఆచార్య’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యబోతున్నారు కొరటాల శివ.