Disha Family Moves Court Seeking Ban On Rgv Disha Movie
Disha Movie: కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనలోని క్రియేటర్ నిద్రపోతున్నాడేమో అన్నట్లుగా గతకొద్ది రోజులుగా రిస్క్ లేకుండా వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు ఆర్జీవి.
అలా వర్మ చేసే సినిమాలన్నిటికీ వద్దన్నా ఫ్రీగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. దిశ ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దిశ తండ్రి ఆ మూవీ విడుదలను ఆపాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ చేశారు.. తాజాగా దిశ తండ్రి అప్పీలుపై విచారణ ముగించిన హైకోర్టు, సినిమా విడుదలను 2 వారాలపాటు ఆపాలని ఆదేశించింది.
కాగా సినిమాకు దర్శక, నిర్మాతలం తామేనని ఆనంద్ చంద్ర, అనురాగ్ కోర్టుకు తెలిపారు. సినిమా టైటిల్‌ను ‘ఆశ ఎన్‌కౌంటర్’ గా మార్చామని, తమ సినిమాకు ఏప్రిల్ 16న సెన్సార్ బోర్డు వారు A సర్టిఫికెట్ ఇచ్చారని, సెన్సార్ సర్టిఫికెట్‌ను సవాల్ చేసేందుకు వీలుగా వారం రోజులు విడుదల ఆపుతామని, ప్రస్తుతం ఈ చిత్రంతో రామ్ గోపాల్ వర్మకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.