Film Critics Association Helps To Seniar Member Raja Family
Film Critics Association: గత కొద్ది సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 25 వేలు తక్షణ సాయంగా అసోసియేషన్ అందిస్తోంది.. ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూసిన ‘ఎఫ్.సి.ఎ’ సీనియర్ సభ్యులు, మ్యూజికాలజిస్ట్ స్వర్గీయ రాజా కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేశారు..
రాజా భార్య పద్మావతిని కలిసి ‘రాజా గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ సంగీత కుటుంబానికి కూడా తీరని లోటు’ అని ఎఫ్.సి.ఎ అధ్యక్షులు సురేష్ కొండేటి వివరించారు.. ఆయనతో తమకున్న బంధాన్ని ప్రధాన కార్యదర్శి జనార్థన్ రెడ్డి తెలియచేశారు..
వారి కుటుంబానికి అవసరమైన సాయం చేయడానికి అసోసియేషన్ ముందుంటుందని జాయింట్ సెక్రటరీ పర్వతనేని రాంబాబు చెప్పారు.. రాజా కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తనతో పాటు ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు వడ్డి ఓం ప్రకాష్ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..