Ganesh Nimajjanam
Ganesh Nimajjanm – Viral Video: గణేశ్ నిమజ్జనం అంటేనే భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. విఘ్నాలు తొలగించే వినాయకుడికి నవరాత్రులు పూజలు చేసి.. పదోరోజు నిమజ్జనం చేస్తుంటారు భక్తజనం. ఇటీవలే భక్తి శ్రద్ధలతో గణేశ్ నిమజ్జనం పూర్తిచేశారు. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో కాస్త ఆలస్యంగానూ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే… ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ గ్రామంలోని స్థానికులు గణేశ్ నిమజ్జనం జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోని బావిలో.. గణేశ్ విగ్రహాలు పట్టుకుని స్థానికులు కూడా దూకేశారు. బావి లోతు తక్కువగా ఉండటం.. ప్రాణాపాయం లేదన్న భరోసాతో… గణపతి ప్రతిమలను పట్టుకుని నీళ్లలో దూకామని స్థానికులు తెలిపారు.