Happy Birthday Ajith : నాడు బైక్ మెకానిక్.. నేడు బాక్సాఫీస్ కింగ్ మేకర్..

‘తల’ అజిత్ కుమార్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్, తెరమీద కనబడితే పూనకంతో ఊగిపోతారు.. తెలుగు నుండి తమిళనాడుకి వెళ్లి మూడు దశాబ్దాలుగా అక్కడ తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతుండడం తెలుగువారికి గర్వకారణం..

Happy Birthday Ajith

Happy Birthday Ajith: ‘తల’ అజిత్ కుమార్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్, తెరమీద కనబడితే పూనకంతో ఊగిపోతారు.. తెలుగు నుండి తమిళనాడుకి వెళ్లి మూడు దశాబ్దాలుగా అక్కడ తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతుండడం తెలుగువారికి గర్వకారణం.. సింప్లిసీటికి కేరాఫ్ అడ్రెస్ అజిత్.. కోట్లాది రూపాయలు పెట్టి కొన్న కార్లున్నా, సామాన్యుడిలా ఆటోలో వెళ్తారు. పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం, ఓటు వెయ్యడానికి అందరిలానే క్యూ లో నిలబడతారు.. బైక్ మెకానిక్‌ నుండి బాక్సాఫీస్ కింగ్ మేకర్ స్థాయికి వెళ్లినా, తానో సెలబ్రిటీ అనే హంగూ ఆర్భాటం అస్సలు కనబడదు ఆయనలో..

అజిత్‌కు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం.. ఇప్పటికే పలు రేసుల్లో పాల్గొని టైటిల్స్ గెలిచారు.. ఫార్ములా వన్ రేస్‌తో పాటు రైఫిల్ షూటింగ్‌లోనూ అజిత్ సత్తా చాటారు.. 1971 మే 1న జన్మించిన అజిత్ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అజిత్ నటిస్తున్న 60వ సినిమా ‘వలిమై’ ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు.. ‘నేర్కొండ పార్వై’ తర్వాత దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్‌తో అజిత్ చేస్తున్న రెండో చిత్రమిది.. తర్వాత వెంటనే మళ్లీ ఈ ముగ్గురి కలయికలో అజిత్ 61వ సినిమా చెయ్యనున్నట్లు ప్రకటించారు.

Thala Ajith Kumar : ముచ్చటగా మూడోసారి.. ‘వలిమై’ విడుదలకు ముందే ‘తల’ 61 ప్రారంభం..!

తమ అభిమాన నటుడు ‘తల’ అజిత్ 50వ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుండే ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం మొదలెట్టారు.. ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’, ‘నేర్కొండ పార్వై’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న ‘తల’ అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పలు భాషలకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్, ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు..