జులైలో పాఠశాలలు..ఆగస్టులో యూనివర్సిటీలు ఓపెన్

  • Publish Date - June 4, 2020 / 06:26 AM IST

కరోనా కారణంగా…లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు, ఇనిస్టిట్యూట్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కేసులు ఎక్కువవుతున్నా..లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చింది కేంద్రం. కొన్ని కండీషన్స్ తో ఓపెన్ చేసుకోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చిన రాష్ట్రాలకు సూచనలు చేసింది.

పాఠశాలలు, కాలేజీలు తెరిచే అంశంపై ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. జులై నుంచి దశల వారీగా పాఠశాలలను, ఆగస్టులో కాలేజీలు, విశ్వ విద్యాలయాలను తిరిగి ప్రారంభించాలని హార్యానా ప్రభుత్వం నిర్ణయించింది. జులై 01 నుంచి 10, 11, 12 తరగతులకు, 15 రోజుల తర్వాత…6, 7, 8, 9 తరగతులు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి కన్వర్ పాల్ వెల్లడించారు.

ఆగస్టులో ప్రైమరీ క్లాసులు చేపడుతామన్నారు. షిప్టుల వారీగా తరగతులు నిర్వహించబడుతాయని, సగం మంది విద్యార్థులు మొదటి షిప్టుకు, మిగిలిన వారు రెండో షిప్టుకు వస్తారన్నారు. కానీ షిప్టుల సమయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదిలా ఉంటే..జూన్ 08వ తేదీన 10వ తరగతి ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డ్ ఆఫ్ స్కూల్ (BSEH) ప్రకటించింది. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,16,919కేసులు నమోదవగా.. మృతుల సంఖ్య 6,075 కి చేరుకుంది. 1,06,737 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,107 మంది కోలుకున్నారు. హర్యానా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1842 ఉండగా..1089 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 23 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 954 కేసులున్నాయి. 

Read: మాల్యా ఇండియా వస్తున్నట్లుగా వచ్చిన వార్తలు అబద్ధమే