ఏడాది క్రితమే వివాహం, ఇంతలోనే దారుణం.. అనుమానంతో భార్య హత్య
- Naveen
- Published On : January 30, 2021 / 10:16 AM IST
husband-murder-wife
husband murder wife: నెల్లూరు జిల్లా కొడవలూరు ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానం పెను భూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఉన్మాదిగా మారాడు. గొంతుకోసి అతి దారుణంగా భార్యను హత్య చేశాడు. భర్త పేరు హరికృష్ణ. భార్య పేరు స్రవంతి. ఏడాది క్రితమే వివాహం చేసుకున్నారు. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. హత్య తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
