Covid cases in india
COVID: దేశంలో కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన రోజువారీ కరోనా కేసులు సోమవారం మాత్రం తగ్గాయి. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది. కొత్తగా 6,594 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. అంతకుముందు రోజు నమోదైన కేసుల (8,084)తో పోల్చి చూస్తే కొత్తగా నమోదైన కేసుల్లో 18 శాతం తగ్గుదల కనపడిందని పేర్కొంది.
congress: ఏ నేరంపై విచారణ జరుపుతున్నారని అడిగితే సమాధానం లేదు: చిదంబరం
దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 50,548కు పెరిగింది. నిన్న కరోనా నుంచి 4,035 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,61,370గా ఉంది. రికవరీ రేటు 98.67గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. అలాగే, వారాంతపు పాజిటివిటీ రేటు 2.32 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 85.54 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న 3,21,873 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 195.35 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు.