‘ఇండియానా జోన్స్’ సిరీస్‌లో చివరి సినిమా.. ఎప్పుడంటే..

  • Publish Date - December 13, 2020 / 07:09 PM IST

Indiana Jones 5: ‘ఇండియానా జోన్స్’ .. ఈ క్రేజీ ఫ్రాంచైజ్ గురించి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టీమ్. ఈ కామెడీ అడ్వెంచరస్ సిరీస్‌లో లాస్ట్ సిరీస్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. స్టీఫెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్‌లో ఇప్పటి వరకూ వచ్చిన సిరీస్‌లు సూపర్ హిట్ అయ్యాయి. మరి లాస్ట్ సిరీస్‌ని డైరెక్ట్ చెయ్యబోతున్న కొత్త డైరెక్టర్ ఎవరు..? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో డీటెయిల్స్ చూద్దాం..

నాలుగు సినిమాలు.. టాప్ లేపాయి..
అమెరికన్ అడ్వెంచరస్ కామెడీ యాక్షన్ సిరీస్ ఇండియానా జోన్స్ ఫస్ట్ సిరీస్ రిలీజ్ అయ్యి దాదాపు 40 సంవత్సరాలు కావస్తోంది. స్టీఫెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్లో ఇంట్రస్టింగ్ ఫిక్షనల్ ఆర్కియాలజీ కంటెంట్‌తో ఇప్పటి వరకూ నాలుగే సిరీస్‌లు వచ్చినా.. ప్రతి సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యి నెక్ట్స్ సిరీస్ కోసం ఆడియన్స్‌ని వెయిట్ చేసేలా చేసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా లాస్ట్ సిరీస్ రాబోతోందని, 2022 లో ‘ఇండియానా జోన్స్’ లాస్ట్ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

వేటికదే డిఫరెంట్..
1981 లో Raiders of the Lost Ark (రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్) సినిమాతో వచ్చిన ‘ఇండియానా జోన్స్’ ఫస్ట్ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. తర్వాత 3 ఏళ్లకి 1984 లో వచ్చిన Indiana Jones and the Temple of Doom (ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ డూమ్) సేమ్ సక్సెస్‌‌ని కంటిన్యూ చేసింది. 1989 లో Indiana Jones and the Last Crusade (ఇండియానా జోన్స్ అందడ్ ద లాస్ట్ క్రూసేడ్), లాంగ్ గ్యాప్ తర్వాత 2008 లో Indiana Jones and the Kingdom of the Crystal Skull (ఇండియానా జోన్స్ అండ్ ద కింగ్ డమ్ ఆఫ్ ద క్రిస్టల్ స్కల్) ఫోర్త్ సిరీస్ వచ్చాయి. హారిసన్ ఫోర్డ్, జాన్ రైస్, డెనామ్ ఎలాయిట్, ఇండియన్ లెజెండరీ యాక్టర్ అమ్రిష్ పురి, ఎలిసన్ డూడీ (ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు), షాన్ కానరీ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సిరీస్‌లన్నీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి.

సిరీస్‌లో లాస్ట్ మూవీ.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు..
‘ఇండియానా జోన్స్’ 4 సిరీస్‌లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. స్టీఫెన్ స్పీల్ బర్గ్ ఈ నాలుగు సినిమాలను డైరెక్ట్ చేస్తే ..లాస్ట్ సిరీస్‌ని మాత్రం జేమ్స్ మ్యాన్ గోల్డ్ డైరెక్ట్ చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ హిలేరియస్ కామెడీ అడ్వెంచరస్ Indiana Jones 5 సినిమాను జూలై 29, 2022 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రేజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్.