IPL 2020: డికాక్ ఇంటర్వ్యూ మధ్యలో నీతా అంబానీ వచ్చి ఏం చేసిందో తెలుసా
- Subhan Ali Shaik
- Published On : November 11, 2020 / 04:19 PM IST
మరోసారి టైటిల్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2020 గెలుపు సంబరాల్లో టీమ్ మునిగిపోయి ఉన్న సమయంలో ప్లేయర్లు పర్సనల్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఫైనల్ పోరులో ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో గెలుపుతో పాటు గత మ్యాచ్‌ల ఆటతీరు గురించి మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో డికాక్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన నీతా అంబానీ.. అది చూసుకోకుండా నేరుగా వచ్చేసి హే డికాక్ అని అరుస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఉన్నాడని తెలిసి సిగ్గుపడుతూ వెనక్కువెళ్లిపోయింది.
ఫ్రాంచైజీ విజయం పట్ల సంతోషాన్ని పంచుకునేందుకు వచ్చిన నీతా అలా చేయడంతో ఈ వీడియోపై పలు రియాక్షన్లు వస్తున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు డికాక్ హైస్కోరర్ గా నిలిచాడు. 16మ్యాచ్ లలో 503పరుగులు చేయగలిగాడు.
‘ఫ్యామిలీని వదలుకోవడం ఎవరికైనా కష్టమే. ఇదొక గ్రేట్ ఫీలింగ్. ముంబై ఇండియన్స్ బ్యాక్ టూ బ్యాక్ టైటిల్స్ గెలుచుకుంటుందంటే ప్రతి ఒక్కరిలో సందేహంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంతకుమించి శ్రమించారు. సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు ప్రతి ఒక్కరూ.. వాళ్లు లేకుండా మేం ఇది సాధించగలిగే వాళ్లం కాదు. ఇది చాలా ప్రత్యేకం’ అని ఇంటర్వ్యూలో డికాక్ చెప్పాడు.
Nita Ambani unaware of the fact that QDK and NCN were being interviewed by Simon Doull crashed their interview ???
Absolute Gold ⚡️#IPLfinal #IPL2020 pic.twitter.com/U7eo0KxjG0
— Amey Pethkar ???? (@ameyp9) November 10, 2020
డికాక్ తో పాటుగా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్‌లు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ముంబై ఇండియన్స్ కు ఇది ఐదో ఐపీఎల్ ట్రోఫీ.
