IT rides on Mythri Movie Makers
Mythri Movie Makers : తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే టాప్ ప్రొడక్షన్ కంపెనీగా పేరుని సంపాదించుకున్న నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’. కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ, క్వాలిటీ మేకింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్టులు అందుకుంటూ.. టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా నిలిచింది. ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ని అందుకొని దూసుకుపోతున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి.
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో తెలుసా?
తాజాగా నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి కొబ్బరి కాయి కొట్టారు ఈ నిర్మాతలు. గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ మూవీ లాంచ్ అవ్వగానే, నేడు ‘మైత్రి మూవీ మేకర్స్’ కార్యాలయాలుపై ఐటి దాడులు జరగడంతో ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. ఏకకాలంలో ఒకేసారి 15 చోట్ల ఈ రైడ్స్ జరిగిని అని తెలుస్తుంది.
ఈ సోదాలు వెనుక పలానా పార్టీ ఉంది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సోదాలు గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి.. బాలకృష్ణ – వీరసింహారెడ్డి, చిరంజీవి – వాల్తేరు వీరయ్య సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ ల పుష్ప-2, విజయ్ దేవరకొండ – ఖుషి, కళ్యాణ్ రామ్ – అమిగోస్ సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి.