Jabardasth Hari : ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో జబర్దస్త్‌ కమెడియన్‌ హరి.. పోలీసులు గాలింపు..

గతంలో ఒకసారి రెడ్‌శాండల్‌ స్మగ్లింగ్‌ కేసులో హరి పట్టుబడ్డాడు. అయినా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మానలేదు. దీంతో హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..

Jabardasth Comedian Hari Involved In Red Sandal Smuggling Case

Jabardasth Hari: జబర్దస్త్ షో లో లేడీ గెటప్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హరి స్మగ్లింగ్ కేసులో ఇరుకున్నాడు.. ఇప్పటికే పలువురు జబర్దస్త్ నటులు కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో హరి పేరు రావడం ఇది రెండో సారి.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో మరోసారి జబర్దస్త్‌ కమెడియన్‌ హరి పేరు తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని చీకిమానుకోన అటవీప్రాంతంలో రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌ అవుతుందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దాడులకు దిగారు. ఎనిమిది మంది స్మగ్లర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్‌ హరి తప్పించుకున్నాడు. పరారైన హరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

గతంలో ఒకసారి రెడ్‌శాండల్‌ స్మగ్లింగ్‌ కేసులో హరి పట్టుబడ్డాడు. అయినా స్మగ్లింగ్‌ కార్యకలాపాలు మానలేదు. దీంతో హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చీకిమానుకోన అటవీప్రాంతంలో పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులతో పాటు మూడు లక్షల రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్‌ చేశారు..